101
చెవులకు
పెదాలు అన్చి
రహస్యపు
చక్కలిగింతల మధ్య
ఆమె
అంటుంది
నీ
ఒక్కో మోజుకో, ఆశకో, ఉద్వేగానికో
మూలమై
నిలిచి, నీలో చలిస్తూ
నిన్ను
నడిపుతూ
నీలోపల
లెక్కపెట్టలేనంత మంది
మనుషులు
ఉంటారు తెలుసా అని.
ఒక్కో
మోజు మరణించే కొద్ది
దాని
ప్రాతినిధ్యపు మనిషి కూడా కాలం చేసేస్తుంటాడు.
లోపల
మనుషులెవ్వురూలేకుండా
నువ్వొక్కడివే
మిగలడాన్నే మోక్షం అంటారేమో
అంటుందామె,
చెవి సౌఖ్యాన్ని భంగపరుస్తూ.
010916