1971 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన 10 వ్యాసాలను, 1977 లో కాకతీయ శిల్పం పేరుతో, అనుపమ ప్రచురణల, విజయవాడ వారు పుస్తకంగా ముద్రించారు. రచయిత - చలసాని ప్రసాదరావు గారు. అప్పటి వెల - 10 రూపాయిలు.
కాకతీయ దేవాలయాలపై అనేక ప్రాథమిక అంశాలను చర్ఛిస్తూ సాగిన ఈ పుస్తకం,.కాకతీయ శిల్పం గురించి కొత్తగా తెలుసుకునే వారికి ఉపయుక్తంగా వుంటుంది. చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం కొన్ని సార్లు విసుగుపుట్టిస్తుంది.
దీన్ని చదవాలనుకునే వారు మీ దగ్గరలోని శాఖా గ్రంథాలయంలో సంప్రదించగరు.