Pages

4 February 2012

టీచర్ (కవిత - 2)



మా సార్

ముళ్ళ పొదల్లో  ఇరుక్కున్న
నా ఆలోచనలకు
వెలుగు బాటను చూపి ,
తానక్కడే మిగిలి పోతాడు.

తన స్వప్నాల్ని
నా బుర్ర లోకి నెట్టి
నిశ్శబ్ధం గా  నలిగి పోతాడు.

నా జీవితాన్ని
నా చేతుల్లో పెట్టి
నా వంక చూడకుండానే
వెళ్లి పోతాడు.

నా లక్ష్యంనా మార్గం,
నా స్వప్నంనా జ్ఞానం,
అన్నీ  తానై,
మౌనం గా మురుస్తూ ,
మనసులో మెరిసిపోతాడు.
ఓ జ్ఞాపకం గా మిగిలి పోతాడు.

7 comments:

  1. నిజమే ఉపాధ్యయుడంతే.అల్ప సంతోషి. అందుకే అంత మంచిపేరు సమాజం లో .ఎవ్వరికి మొక్కని చేతులు ఆయన కనపడగానే
    లేస్తాయి .

    ReplyDelete
  2. నిజమే ఉపాధ్యయుడంతే.అల్ప సంతోషి. అందుకే అంత మంచిపేరు సమాజం లో .ఎవ్వరికి మొక్కని చేతులు ఆయన కనపడగానే
    లేస్తాయి .

    ReplyDelete
  3. This is my fav'te one. I realize the selfless advice of my teachers which I couldn't understand then.
    నా జీవితాన్ని
    నా చేతుల్లో పెట్టి
    నా వంక చూడకుండానే
    వెళ్లి పోతాడు.
    Awesome!!!!

    ReplyDelete
  4. ee kavitha basava lingam sarke ninty persent,
    sar gurinchi malli eppudaina rayaali.

    ReplyDelete