కొంత ద్రవ్యరాశిని కలిగి
వుండి,
స్థలాన్ని ఆక్రమించే దేనినైనా పదార్థం అంటారు.
పదార్థం మూడు స్థితులలో
లభిస్తుంది.
1) ఘణ స్థితి 2) ద్రవస్థితి
3) వాయు స్థితి
ఆకారం, ఘణ పరిమాణం,
సంపీడ్యత, వ్యాపనం అనేవి పదార్థాల యొక్క కొన్ని ముఖ్యమైన ధర్మాలు.
ఆకారం
ఘణపదార్థాలు నిర్థిష్టమైన
ఆకారాన్ని కలిగివుంటాయి.
ద్రవపదార్థాలు వాటిని
నిల్వచేసే పాత్రలరూపాన్ని బట్టి వాటి ఆకారాలను మార్చుకుంటాయి.
వాయువులు ఆకారాన్ని
కలిగివుండవు.
ద్రవాలు, వాయువులు ఒక చోటు
నుంచి మరొక చోటుకి సులభంగా ప్రవహిస్తాయి. అందుకే వాటిని ప్రవాహులు అని అంటారు.
ఘణపరిమాణం
ఘణ మరియు ద్రవ పదార్థాలు
నిర్థిష్ట ఘణపరిమాణాన్ని కలిగివుంటాయి.
వాయు పదార్థాలకు నిర్థిష్ట
ఘణపరిమాణం వుండదు.
సంపీడ్యత
ఘణ, ద్రవ పదార్థాలతో
పోల్చినప్పుడు వాయువులు ఎక్కువ సంపీడ్యతను పొందుతాయి. అందువలననే LPG, CNG గ్యాస్ సిలిండర్లలో అత్యధిక పీడనంతో, ఎక్కువ
వాయువును నిల్వచేస్తారు.
CNG ( COMPRESSED
NATURAL GAS) సంపీడిత సహజవాయువు.
LPG(LIQID PETROLIUM
GAS) ద్రవ పెట్రోలియం వాయువు.
వ్యాపనం
* ఒక పదార్థం మరొక
పదార్థంలో కలిసే ప్రక్రియను వ్యాపనం అంటారు.
పదార్థ స్వభావం పై ఆధారపడి
వ్యాపనం ఏ స్థితిలోనైనా జరుగుతుంది.
వ్యాపనం యొక్క వేగాన్ని
వ్యాపనరేటు అంటారు..వాయువుల యొక్క వ్యాపనరేటు చాల ఎక్కువగా వుంటుది.
ఆక్సిజన్ రక్తంలోకి,నీటిలోకి వ్యాపనం చెందడం వల్ల
జంతువులు, చేపలు లాంటివి జీవించగలుగుతున్నాయి. కూల్ డ్రింక్స్, సోడాలలో కార్బన్ డై
ఆక్సైడ్ వ్యాపనం చెందిస్తారు.
పదార్థం చిన్నచిన్న
అణువులతో ఏర్పడుతుంది.
ఈ కణాల మధ్య ఆకర్షణ బలాలు
వుంటాయి. పదార్థాన్ని బట్టి, పదార్థ స్థితిని బట్టి ఈ ఆకర్షణ బలాలు మారుతూ వుంటాయి.
ఈ కణాల మధ్య కొంత ఖాళీ
స్థలం వుంటుంది. ఘణ, ద్రవ, వాయు పదార్థాలలోని అణువుల అమరిక ఇలా వుంటుంది.
పదార్థాల స్థితి మార్పు.
పదార్థాలు ఒక స్థితినుండి
మరొక స్థితికి మారుతాయి.
ఇది ఉష్ణోగ్రత మరియు పీడనం
అనే అంశాలపై ఆధారపడి వుంటుంది.
ఉష్ణోగ్రతా మానాలు.
ఒక పదార్థం యొక్క వెచ్చదనం
లేదా చల్లదనం స్థాయినే ఉష్టోగ్రతా అంటారు. ఉష్ణోగ్రతను ప్రధానంగా సెంటిగ్రేడ్
మరియు కెల్విన్ మానాలలో కొలుస్తారు. ఏదైనా ఉష్ణోగ్రతను సెంటిగ్రేడ్ మానం నుండి
కెల్విన్ మానంలోకి మార్చాలంటే 273 ను కూడాలి.
ఉదా: 0 o C = 0 + 273 = 273 o K
ఏదైనా ఒక ఉష్ణోగ్రతను
కెల్విన్ మానం నుంచి సెంటిగ్రేడ్ మానంలోకి మార్చాలంటే 273ను తీసివేయాలి.
ఉదా : 0 o K =
0 - 273 = -273 o C
ద్రవీభవన స్థానం
ఏ నిర్థిష్ట ఉష్ణోగ్రత వద్ద
ఘణపదార్థాలు, ద్రవ స్థితికి మారుతాయో, ఆ ఉష్ణోగ్రతను దాని యొక్క ద్రవీభవన స్థానం
అంటారు.
మంచు యొక్క ద్రవీభవన స్థానం
0 o C or 273o K
మరుగు స్థానం
ఒక నిర్థిష్ట ఉష్ణోగ్రత
వద్ద ద్రవపదార్థాలు వాయు రూపంలోకి మారుతాయి.
ఆ ఉష్ణోగ్రతనే వాటి మరుగు
స్థానం అంటారు.
నీటి యొక్క మరుగుస్థానం 100o C or 373o K
ఒక పదార్థం యొక్క ద్రవీభవన,
మరుగుస్థానాలు దానిలోని కణాల మధ్యగల ఆకర్షణ బలాల మీద ఆధారపడి వుంటాయి.
కణాల మధ్య ఆకర్షణబలాలు
ఎక్కువగా వుంటే ఆ పదార్థాల ద్రవీభవన, మరుగుస్థానాలు ఎక్కువగా వుంటాయి.
గుప్తోష్ణం
ఒక స్థిర
ఉష్ణోగ్రత వద్ద కేవలం స్థితి మార్పు కోసం ఒక పదార్థం గ్రహించే లేదా విడుదల చేసే
ఉష్ణశక్తినే గుప్తోష్ణం అంటారు.
దీనిని L అనే అక్షరంతో సూచిస్తారు.
ఉత్పతనం
వేడి చేసినప్పుడు
కొన్ని పదార్థాలు ఘణస్థితి నుండి వాయుస్థితికి చేరుకుంటాయి. ఈ ప్రక్రియనే ఉత్పతనము
అంటారు.
దీనికి ఉదాహరణ అయోడిన్
ఘణస్థితిలో వున్న కార్భన్
డై ఆక్సైడ్ ను పొడిమంచు అంటారు. సాథారణ వాతావరణ పీడనం వద్ద ఇది సులభంగా
వాయురూపంలోకి మారిపోతుంది.
భాష్పీభవనం ( ఇగరడం)
ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత
వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను భాష్పీభవనం అంటారు.
ఇది ఉపరితల ప్రక్రియ.
ఇది శీతలీకరణ ప్రక్రియ.
ఇది ఏ ఉష్ణోగ్రత వద్దనైనా
జరుగుతుంది.
ఒక ద్రవం యొక్క భాష్పీభవన
రేటు , ఆ ద్రవ ఉపరితల వైశాల్యం , ఉష్ణోగ్రత, గాలిలోని ఆర్థ్రత, గాలివేగం వంటి
అంశాలపై ఆధారపడుతుంది.
నిత్యజీవితంలో భాష్పీభవనం
చెమట ఆవిరైటప్పుడు మన శరీర
ఉష్ణోగ్రత తగ్గి చల్లగా అనిపిస్తింది.
కుండలోని నీరు చల్లగా
కావడం.
కుక్కలు నాలుకను బయటకు
వుంచడం ద్వారా వాటి శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి.
బర్రెలు, గేదెలు, పందులు
లాంటి జంతువులు బురదపూసుకోవడం, నీటిలో మునగడం ద్వారా వాటి శరీర ఉష్ణోగ్రతను
క్రమబద్దీకరించుకుంటాయి.
( ఇది తెలుగు మీడియం విద్యార్థులకోసం, అవసరమైన వారు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చు)
( ఏమైనా మార్పులు చేర్పులు వుంటే సూచించగలరు)