Pages

16 November 2012

కొన్ని సార్లు........


దూరంగా పారిపోతున్న ఆ దీప్తులను,
గట్టిగా మూటకట్టి పెట్టుకోవాలి.
చీకట్లు ముసిరినప్పుడో,
నిశీధి కబళించినప్పుడో,
నన్ను నేను రక్షించుకోవడానికి,.

గుప్పెడంత తిమిరాన్ని,
గుట్టుగా జేబులో దాచుంచుకోవాలి,
తీవ్ర ద్యుతిలో, కన్ను మిన్ను గానక
సంచరించేటప్పుడెప్పుడన్నా,
కొద్దిగా రుచి చూసి,
నేను నేనుగా మిగలడానికి. 

8 comments:

  1. చిన్న చిన్న పదాల్లో ఎంతో భావగర్భితంగా వ్రాయడంలో మీకు మీరే సాటి అండీ..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుభ గారు, మీకు నచ్చినందుకు,.

      Delete
  2. భాస్కర్ గారు,
    రెండవది అద్భుతంగా ఉంది. మొదటి దానిలో నిశీథి కబళించడానికీ, చీకట్లు ముసరడానికీ ఏమైనా తేడా ఉందంటారా?

    ReplyDelete
  3. ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు,...తేడా పెద్దగా ఏం లేదండి,..చీకట్లు ముసరడం చిన్నచిన్ని కష్టాలు, నిశీధి కబళించడం తీవ్రమైన కష్టమనేమో.....బలంగా చెప్పడం కోసంమైనా అయివుండచ్చు,.

    ReplyDelete
  4. బాగున్నాయి రెండూ

    ReplyDelete
  5. పద్మార్పిత గారు,,ధన్యవాదలండి

    ReplyDelete
  6. చాలా నచ్చింది భావం...అభినందనలతో...

    ReplyDelete
  7. ధన్యవాదాలు వర్మ గారు,

    ReplyDelete