Pages

27 March 2016

బేకారీలు 26-30

26
నీలో రంగుందా? రుచుందా?
ఆస్వాదింపచేసే శక్తుందా?
అన్నాన్నేను, కాస్తా ఆవేశంగా.

ఒకప్పుడుండేది
నువ్వు రాయకముందు.
ఇప్పుడేం మిగల్లేదు
అంది కవిత్వం బేలగా.

27
ఒక్కసారి ఆయన చేతిలో పడితే
పెద్ద కవినై పోతా తెలుసా,
అన్నాన్నేను ఆరాధనగా.

కవివి కాకపోతే
కొంపెం మునగదు కాని,
ఎవడి చేతిలోనో
పనిముట్టుగా మారబాక
అందామె, చిరాగ్గా.

28
కవులన్నాక
కాస్తంత కన్ఫ్యూజన్ వుండాలోయ్.

బయటకు రావాలా
వద్దా అన్నట్లుగా
అలల్లాగ కొట్లాడుతూ.

అప్పుడే కదా
కవిత్వం
సముద్రమై మిగిలేది.

29
ప్రెషర్ పాయింట్లో
మాటే కాటై,
గుండెన గాటై
బ్రెయిన్ బ్లాంకై
జీవితం, ఒక వెర్రిచూపు.
160915

30
ఉదయాన్నే రొడ్డు
రెక్కలు మొలిపించుకుంది.

చక్రాల క్రింద పడి నలిగిన
సీతాకోకల రంగుల ఆశలతో.

170915

No comments:

Post a Comment