Pages

7 January 2014

రిప్పు



ఏనాడు గుర్తించలేని గుప్పెడు అభిమానం,
దుఃఖమై పొంగి కన్నీరు కార్చేస్తుంది.

చలిగాలుల చిక్కులు తప్పించుకోలేక
అన్నీ మూసుకున్న శరీరం వంటరిగా,
రేపటి కోసం ఎదురుచూస్తుంది,
భవిష్యత్తుపై కించిత్ బాధలేక.

ఆగిపోయిన పెళ్లి పెనుభూతమై
కావలికాస్తుంది, నిరంతరం వేటాడి
ఇక ఈ రాత్రి శవజాగరణానందంలో.

ఏ బంధాలు బలహీనతలు స్పష్టమై
గీతలు గీసుకుంటాయో చెరగకుండా,

విడవడిన చేతులు, చుట్టుకోలేక వంటిని
ఎక్కడ కాపుకాసాయో, నిన్ను ఎత్తుకుపోను

కమిలిన మెడలు సాక్ష్యాల కొరకు,
పగిలన మది పెంకులు కాష్టాల కొరకు.

మిత్రుల కన్నీరు కాసిన జ్ఞాపకాల కొరకు.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/683848108334611/

1 comment:

  1. ఏ బంధాలు బలహీనతలు స్పష్టమై
    గీతలు గీసుకుంటాయో చెరగకుండా...భలే రాసారండి

    ReplyDelete