Pages

8 January 2013

నాకోక స్మృతి కావాలి,.




ధృక్పధ వైరుధ్యాలు, చారిత్రిక సంవాదాలు,
విషాదాత్మక పురాతన సంపుటాలనుంచి,
ఒక్కోక్క రక్తపు కణంలో పోగైవున్న,
వేల సంవత్సరాల నిరంతర విధులనుంచి,
నిరాటంక నిధులనుంచి,
సౌందర్యాత్మక క్రతువుల గతం నుంచి,.
గుట్టులుగుట్టలుగా పేరుకుపోయిన,
ఉత్కృష్ట జ్ఞానపుకాంతులతో.
సాంప్రదాయాలను అంగీకరించలేనంతగా,
నా మస్తిష్కం పరిఢవిల్లుతున్నప్పుడు,
 నాకోక స్మృతి కావాలి,
దివ్యావేశభరిత లోతుల్లోకి,
సునాయసంగా పయనించడానికి,
సాంద్రీకరించబడిన వ్యామోహం,
పాక్షికంగానైనా విరళీకరించబడటానికి,
నేను నేను గా మిగలడానికి,
నాకోక స్మృతి కావాలి,.
ఏ ఋషులదో,ప్రవక్తలదో, మహాద్రష్టలదో,..

4 comments:

  1. superb man nenu enno raathrulu ilanti alochanalatho thalladillanu.nka samaadhaanam dorakaleedu inthaku mundu cheppinattu alochinchadam maanesaa

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు తనోజ్, మీ ఒక్కరికన్నా నచ్చినందుకు ఆనందంగా వుంది,..కామెంట్లు చేయకుండా కామెంట్లు రావుకదా..హ,.హ,

      Delete
  2. స్మృతి పథాన్ని నిర్దేశించే స్మృతి అన్వేషణే మనిషిని మనిషిగా నిలిపి వుంచుతుంది కదా..
    మీ అన్వేషణ ఫలవంతం కావాలని ఆశిస్తూ......

    అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వర్మ గారు,,..అన్యేషణ ఫలవంతం కావడంకంటే ఆనందమేముటుందండి,...

      Delete