Pages

31 December 2012

చివరి తొక్కలు,,.ఈ సంవత్సరానికి,...happy new year,.


(1)
మూర్ఖత్వమే బలం - జ్ఞానమే బలహీనత.
(2)
తన మేధస్సుకి ముగ్ధుడై,
సంశయాన్ని,ఆలోచనను, ప్రశ్నను పక్కకునెట్టి,
సమర్ధించుకోవడం మొదలవుతుందో,
ఆ క్షణం ఒక మూర్ఖమేధావిని సృష్టిస్తుంది,.
(3)
అజ్ఞానం జోకొట్టి నిద్రపుచ్చింది,
అరాకొర జ్ఞానం గిచ్చిగిచ్చి ఏడిపిస్తుంది,..
(4)
సంతృప్తి నరకంలో నవ్వుతుందని,
అసంతృప్తి స్వర్గంలో పొల్లిపొల్లి ఏడుస్తుంది,.
 (5)
జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య,
కొన్ని ప్రశ్నలుంటాయ్,
ఎంతటి జ్ఞానికైనా కొన్ని ప్రశ్నలు మిగిలేవుంటాయ్,..
(6)
జ్ఞానం అజ్ఞానం ఒకే నాణెం కు రెండు ముఖాలు.
(7)
నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకోవడానికి

 కొద్దిపాటి జ్ఞానం చాలు,

నేను జ్ఞానిని అని చెప్పుకోవడానికి

  చాల మూర్ఖత్వం కావాలి.
(8) 
మూర్ఖత్వం  జ్ఞానానికి వత్తి లాంటిది.
(9)
జ్ఞానానికి చివరిమెట్టు మళ్ళీ అజ్ఞానమే.





4 comments:

  1. nice bhaskar garu and happy new year

    ReplyDelete
    Replies
    1. రమేష్ గారు ధన్యవాదాలండి,..కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

      Delete
  2. సంతృప్తి నరకంలో నవ్వుతుందని,
    అసంతృప్తి స్వర్గంలో పొల్లిపొల్లి ఏడుస్తుంది,.

    dont know y,but i liked these lines

    ReplyDelete
    Replies
    1. హ,హ,..నాకు కూడా తెలియదేమో తనోజ్,.happy new year

      Delete