Pages

8 December 2012

పురిపండ అప్పలస్వామి // భైరవి ( పులిపంజా సంకలనం నుంచి)



(1904-1982),. .....ప్రచురణకాలం బహుశా 1935-1945
పాతిన శిశువుల
లేత దేహములు
విందులు కుడిచే
నక్కల్లారా!
కుక్కల్లారా!

కుళ్లిన శవాల
మాసం తింటూ
పాటలు పాడే
పులుగుల్లారా!
పురుగుల్లారా!

కటిక దరిద్రుల
బికారి రైతుల
పీకలు నులిమీ
నెత్తురు తాగే
మెకమ్ముల్లారా!
వృకమ్ముల్లారా!

దుమ్ముల కోసం
కుమ్ముకు చచ్చే
దమ్ముల ముచ్చుల
ముదుసళ్లారా!
బురద గుమ్మిలో
బొందెలు మరిచే
పందుల్లారా!

భావి ప్రపంచం మిధ్యంటారా
భూదేవతనే వంచిస్తారా
రాజుల్లారా!
రాక్షసులారా!

పాపం పుణ్యం
పవళ్లు రేలూ
బొంకంటారా
వంచకులారా!
హంతకులారా!

కనపడలేదా కళ్లేవుంటే
భావి దృశ్యముల ప్రళయ జిహ్వకులు
మీ దేహాలూ
 మీ భోగాలూ
భుగభుగ మండే చితాగ్నులందూ
ఘూర్ణిల్లే వైతరణీ నదిలో
కనపడలేదా మీ గుండెలపై
చిచ్చుల పిడుగుల
విచ్ఛిన  కోరలు
గరళం కక్కే సర్పాలూ
పేగులు చీల్చే శాపాలూ

No comments:

Post a Comment